నువ్వై... నేను..

బుధవారం, జూన్ 27, 2012 కామెంట్‌లు


నీవై ...నీలో నేను ఉన్నాను... 
నీకై ...నాలో  వెతుకుతున్నాను ...
నీలా ఎపుడో నేను మారాను ...
నాలా మారే నిన్ను చూసాను ......
నన్ను తలుచుకుంటుంటే ...నువ్వే గుర్తొస్తున్నావు
నేను లేననుకుంటుంటే ...నువ్వై కనిపిస్తున్నావు 
నువ్వు సంతోషం గా ఉంటే ...నేను చిరునవ్వు నవ్వుతున్నాను 
నేను బాధపడుతుంటే ...నువ్వు కన్నీరొలుకుతున్నావు
నన్ను అద్దంలో చూసుకుంటుంటే ...నువ్వే  కనిపిస్తున్నావు 
నిన్ను చూద్దామనుకుంటే ...అద్దంలా నన్ను చూపిస్తున్నావు 
నువ్వెవరో, నేనెవరో తెలియకుండా పోయింది .............
"నువ్వు, నేను" గా మనల్ని విడదీయలేనంత ప్రేమా ఇది !!!!!!!!!!

ఎవరు నీవు అందమా?

శుక్రవారం, సెప్టెంబర్ 23, 2011 కామెంట్‌లు


ఎవరు నీవు అందమా చిరు నవ్వుల చిత్రమా
మధిన పలుకు బావమా మురిపించుట బావ్యమా?
సిరివెన్నెల సిరల నుండి జాలువారిన కవిత్వమా..
గిరికన్నుల ధరుల నుంచి ప్రవహించే జలపాతమా..
దివిసీమల లోననుండి దిగివచ్చిన అప్సరవా..
వినీలతల ఆవాలన విహరించే గాంధర్వ కన్యవా..
రవివర్మ కుంచే నుండి ఉదయించిన రంగవల్లికవా..
జక్కన్న ఉలి నుండి మలచబడిన నవ శిల్పానివా..
కాళిదాసు కలము నుండి జన్మించిన కావ్యానివా..
అన్నమయ్య గలము నుండి వినిపించిన కీర్తనావా..
ఎవరు నీవు అందమా.. మధిలోని కలల రుపమా..
నను వేధించుట బావ్యమా..నీ చిరునామా చెప్పుమా