ఆ నిమిషం తెలియలేదు
నీ అడుగులో అడుగెయ్యాలని
నీ వెనకే నిలుచున్నాను
నీ అడుగు మరో అడుగులో పడుతుందని
నా జీవితం మరో యేడడుగులే అని
ఆ నిమిషం తెలియలేదు
నీ మాటలే నా పలుకవ్వాలని
నా మాటలకి మౌనం నేర్పాను
నీ మాటలే అరువొస్తున్నాయని
నా పలుకు మూగబోతుందని
ఆ నిమిషం తెలియలేదు
నువు నాతో ఉంటే యే చిక్కుముడులైతే
నా దారికడ్డమేంటనుకున్నా
నీకు పడ్డ మూడు ముళ్ళలో
నా ఊపిరి చిక్కుకు పోతుందని
ఆ నిమిషం తెలియలేదు



