నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది.......

శనివారం, ఫిబ్రవరి 20, 2010 కామెంట్‌లు

నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది
నీతో నన్ను ఊహించుకుంటూ నా మది మురిసిపోయింది
నీ అభిమానానికి నా హృదయం పొంగిపోయింది
ఆ అభిమానానికి అర్థం తెలిసి నా గుండె ఆగిపోయింది
నీతో చెప్పాలనుకున్న మాట నా పెదాలపై కరిగిపోయింది
తీగ తెగిన వీణలా నా గొంతు మూగబోయింది
నీకోసం ప్రాకులాటలో నా మనసు అలసిపోయింది
ఏంటో ఇదంతా కలలా జరిగిపోయింది
కాని నీకు తెలియదు, నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి