స్నేహం

శనివారం, ఆగస్టు 29, 2009 కామెంట్‌లు
జాతి,కుల, మత సరిహద్దులు లేని విశాలమైన సామ్రాజ్యం స్నేహం
తనను ఆశ్రయించిన వారి భారాలను దించి సేద తీర్చే ఉద్యానవనం స్నేహం

ఒంటరిగా తనను చేరిన మనసుకు ఎన్నో మనసుల తోడు నిచ్చే ఆశ్రమం స్నేహం

ఎంత చిలిగిన అమృతం మాత్రమే ఇచ్చే పాల సముద్రం స్నేహం

తప్పులను సరిచేసి విజయాలను ప్రోత్సహించి మనుషులను మనుషులుగా మార్చే విద్యాలయం స్నేహం

తరాలు మారిన యుగాలు గడిచిన తరిగిపోని బండాగారం స్నేహం

తనకు సొంతరూపం, ప్రాణం లేకున్న అందరికి రూపనిచ్చి ప్రాణంగా నిలిచేది స్నేహం....

కాసింత చోటు కల్పించవూ.......

కామెంట్‌లు
మంచి అనే ఉద్యానవనంలో వికసించిన కుసుమానివో


మది అనే నదిలో ప్రవహించే అమౄతానివో

మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో

మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...



మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో

వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో

జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో

వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...



ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో

స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో

మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో

అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో...



చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు

నేను ఎల్లపుడూ సిద్ధం

మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే

కలిసి పయనిద్ధాం

నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన

అర్ధాన్నందించిన ఓ స్నేహమా

అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడా

కాసింత చోటు కల్పించవూ....
కామెంట్‌లు
కాలం గడుస్తూంది...


నేత్రం ఎదురుచూస్తూంది...

ప్రాణం నీరీక్షిస్తూంది...

హృదయం ఆరాటపడుతుంది...

మనసు కాంక్షిస్తుంది...

మది చలించిపోతుంది...

కోయిల కూస్తూంది...

వసంతం వస్తుంది...

మల్లె వికసిస్తుంది... మావి చిగురిస్తుంది...

హుమ్మ్... అయినా నా ప్రయాణం ఇంకా ఎన్నాళ్ళో తెలియకుంది

కురిసే ప్రతి బిందువు స్వాతి ముత్యము కాలేదు

విరిసే ప్రతి పువ్వు పరిమళ్ళన్నివేద జల్లలేదు

ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు

కనిపించే ప్రతి మనిషి స్నేహితుడు కాలేరు

అందుకే భయపడుతుంది న మనసు

ఎవరితో చేయాలి స్నేహం అని......................................

నా ప్రీయ మైన నెస్తమ...!

కామెంట్‌లు
నా ప్రీయ మైన నెస్తమ...!


నా చుపూ నీ కొసం ఏదురు చుస్థుంది...

నా ష్వసా నీ కొసం తపిస్థుంది...

నా ప్రథి ఆసా నువు గొప వెక్తివి కావలని..

నా ప్రతి రక్తపు బొటు నీ కొసం చిందిస్తాను..

నా తుది ష్వసా వదిలె వరకు నిను మరవను..

ఆత్మకి చావు వుండదు.. మన స్నెహనికి కుడ చావు వుండదు..

నీ కొసం తపిస్తున ఈ నెస్సంని మరువకు

కదలిపోయే కెరటంలా.......

కామెంట్‌లు
కదలిపోయే కెరటంలా


సాగిపోయే నావలాంటి నా జీవితాంలో

ఆశల హరివిల్లు పూయిస్తూ ఆప్యాయంగా

పలకరించిన మిత్రమా..

అరుణోదయ సంధ్య లోగిలిలో

సుఖ దు:ఖాల జీవిత సంగమంలో

చివరకు మిగిలేది మిగిలేది మితృలే

మరో సూర్యుడు నాకోసం ఉదయిస్తే..

నేను మరో జన్మలో మనిషిగా జన్మిస్తే,

నీలాంటి స్నేహితురాలి మమతానురాగాల కోసం

ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధమే

అడవి కాచే వెన్నెల

శుక్రవారం, ఆగస్టు 28, 2009 కామెంట్‌లు
అడవి కాచే వెన్నెల
నన్ను చేరు ఓ మరు ఇలా....!
వెంట నడిచే నీడల
నిత్యం తలచే ఓ కల
నిలిచిపోవే నీవలా
పంటపైరుల పసిడిలా
యదకు వీచే గాలిలా
ఓ మగువ మగువ నువ్విలా. ......
వేచిఉన్న కెరటమా
పొంచిఉన్న ప్రళయమా
అందమైన శిల్పమా
ఆవహించే విరహమా
కౌమరపు ఓ వరమా
ఓ మగువ మగువ
మరినీవేవరుమా..........!
నింగినున్న తారక
కడలి చేరవే నీవిక
మదిని కాల్చుతూ మెరవక
అందించవే ఓ కానుక
ఓ మగువ నీ దయ చుపిక.........!
నా దరికి చేరిక.....!

మౌన రాగంతో పలికే.......

కామెంట్‌లు
మౌన రాగంతో పలికే ప్రతి పాటలో తన గాదను నింపి ప్రతి మాటలో తనపై ఉన్న ప్రేమను చూపిస్తూ తనపై ఉన్న మమకారం ఎన్నటికి చెరిగిపోదని ఎన్ని యుగాలైనా సరే తన చెలిమి కోసం వేచి చుదామంది హృదయం............................

నీకై చూసే ఎదురు చూపులో ......

కామెంట్‌లు
నీకై చూసే ఎదురు చూపులో ప్రతి క్షణం నాకు ఒక కొత్త అనుభూతే .....
ఆ అనుభూతుల మజిలీ లో నిన్ను కలిసే క్షణం కోసం వేచి వుంటా ఏకాకి నై కడలి అంచున కడ దాక....
నీతో గడిపే ప్రతి క్షణం నా జీవితంలో ఓ మధుర జ్ఞాపకం ...
ఆ జ్ఞాపకాల వేకువలో అనుక్షణం నా జీవితం లో ఉషోధయమే...
నాలో జనించె ప్రతి గుండె చప్పుడు నిన్ను నాకు గుర్తు చేస్తుంది...
ఆ చప్పుడు ఆగినా ...అవి చేసే ప్రతిధ్వనులు నా ఆత్మలో ఇంకా శాశ్వుతమే....
మరు జన్మలో కుడా నీ సాన్నిత్యం కోసం నా ఆత్మ చేసే తపస్సులో గతించాయి కోటి వేకువలు...
కోటి నిశిధులు......
కామెంట్‌లు
నీ హృదయ ప్రమిద లో నా స్నేహ దీపం వెలిగించా ఆరనివ్వకు నేస్తమా..




నీ జీవన వని లో నా సానిత్యం వికసించింది వాడనివ్వకు మిత్రమా....



నీ కళ్ళ లోతుల్లో నా ప్రతిబింబం దాగుంది పదిలపర్చుకో నేస్తమా....



నీ హృదయ నది లో నా జ్ఞాపకాల అలలు దాగున్నాయి ఎగసిపడనివ్వు మిత్రమా....



నీ కలల కౌముదిలో నా ఊసుల జాడలున్నాయి చెరగనివ్వకు నేస్తమా...



నీ వెతల వేడిమిని నా స్నేహపు జల్లులు చల్లారుస్తాయి వేచి చూడు మిత్రమా....



ఇట్లు

-------------------

నీకై నీ కన్నా ఎక్కువగా పరితపించే నీ నేస్తం.....

నీకొసం ఏదైనా...........

కామెంట్‌లు
కమ్మని కలవు ఐతే నిదురలొనే కలుసుకుంటా
మండు వెసవైతే నిండు గొదారినై ఆవిరౌతా

పయనించె మెఘ మైతె చుంబిచే శికరమౌతా

చిగురించే చిగురువైతె చినుకుకునై చెరుకుంటా

జుమ్మనే తుమ్మెదవైతె కుసుమమై కౌగిలిస్తా

యేటి కలువవు నీవైతే జారిపడే జాబిలౌతా

ఎగసిపడే అలవు ఐతే తన్మయత్వపు తీరమౌతా

తీరిపోని రుణమైతే వేయి జన్మల నీడనౌతా

నేను నీకు భారమైతె ఈ క్షనమె దూరమౌతా

నా మనసు పడే బాధ నువ్వే

కామెంట్‌లు
నా మనసు పడే బాధ నువ్వే


ఆ బాధ కి ఓదార్పు నువ్వే

నేను చేరవలసిన గమ్యం నువ్వే

ఆ గమ్యం చేర్చే ప్రతి అడుగు నువ్వే

నా కనులు చూడాలనే రూపం నువ్వే

నా అలసిన కనులకు అలసట తీర్చే కలవు నువ్వే

నా పెదవులు పలికే ప్రతి పదము నువ్వే

పలికే ప్రతి పదములోని భావం నువ్వే

నేను కలకాలం కోరుకునే తోడూ నువ్వే

నాకు తోడూ కావాలని తెలిపింది నువ్వే

ఎ దిక్కున చూసిన కనిపించే రూపం నువ్వే

నా ప్రేమకి దేవుదిచిన రూపం నువ్వే

నీ ప్రేమలోనే నా తుది స్వాసపోవలనుకునే వాడిని నేను .........
గురువారం, ఆగస్టు 27, 2009 కామెంట్‌లు
అనుమతిస్తావా? నీ సిగలోకి


నే సంపంగి లా చేరగా

తాకనిస్తావా ? నీ పాదాలన్ని

నే పారాణిగా మారగా

చేరనిస్తావా? నీ హృదయ లోగిలికి

నే ప్రేమ కిరణంగా తాకగా

కరుణిస్తావా? నా పేద హృదయాన్ని

నీ ప్రేమకై ఆర్ధించగా

చూపిస్తావా? నా కన్నులకు ఈ లోకాన్ని

నీ జతలో సరిక్రొత్త గా

లాలిస్తావా? నా మనసు ను

పసిపాప లా నీ ఒడికి చేరగా

ఏలనిస్తావా నీ నూరేళ్ళ జీవితాన్ని

నీ మనసు గెలుచుకున్న విజేత గా

కోరుకోవు నా కన్నులు నిన్ను చూపని ఏ కలలు

కామెంట్‌లు
కోరుకోవు నా కన్నులు నిన్ను చూపని ఏ కలలు


సాగవులే నా అడుగులు తోడులేక నీ పాదాలు

మూగబోవ నా మాటలు

కదలకుంటే నీ పెదవులు

మేదలవు నా మదిలో ఏ ఊహలు,

చూపుతుంటే నీ ప్రేమలో నవలోకాలు

గడిపితే చాలు నీ ఒడిలో కొన్ని నిమిషాలు,

దానికి బదులుగా ఇస్తాను నా ప్రాణాలు.
కామెంట్‌లు: 1
నువ్విక దురమౌతున్నావని తెలిసి నా మనసు మూగబోయింది...ఎద నిండా ఎగసిపడే ని జ్ఞాపకాల అలలను ఆపలేకపోతోంది...




కాలంతో పాటు వచ్చిన ఈ కన్నీటిని ,నీ జ్ఞాపకాలను కాలమే చేరిపెస్తుందనుకున్నా..స్వచ్చమయిన నా ప్రేమ శాశ్వుతమని తెల్సుకోలేక పోతున్నా..

ఎదనిండా నిండి పోయిన ఈ వేదన ఇంకేన్నాల్లో ఆలోచిస్తున్నా...



నిన్ను మరిచి జీవించడానికి ప్రయత్నిస్తున్నా..

కానీ లోలోపల మనసు కార్చే కన్నీటిని ఆపలేకపోతున్న...



నన్నొదిలి వెళ్ళిపోతున్న నీకు వీడ్కోలు చెబుతున్నా..

అలాగే నీపై నాకున్న ప్రేమ శాశ్వుతమని కుడా చెబుతున్నా..



ఈ కుల మత విభేదాలను దాటి తమ ప్రేమను సాధించుకునేది కొందరే..అందులో మనం లేమే అని బాధపడుతున్నా...

ఎక్కడున్నా..ఎవరితో ఉన్నా నీ జీవితం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నా...



నీ జీవితంలో నేనేప్పుడయినా తారసపడితే , నీనుంచి నేనశించేది ఒక్కటే..అదీ నీ చిరునవ్వే.....

అప్పటికీ నీపై నా కున్న ప్రేమ శాశ్వుతమని చెప్పడానికి సాక్షి కుడా ఒక్కటే..అదీ ఆ క్షణంలో నా కళ్ళల్లో మెదిలే కన్నీరే....
కామెంట్‌లు
ప్రేమించానని చెబుదామంటే ఆత్మాభిమానం అడ్డొస్తోంది......




చెప్పినా నువ్వు దూషిస్తే నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది....



అలాగని చెప్పకున్నా ..ఆత్మన్యూనతా భావం నన్ను వేధిస్తోంది.. ..



చెప్పక, చెప్పలేక, చెప్పకుండా వుండలేక నా మనసు రగిలిపోతోంది...



ఆయినా నాకనిపిస్తోంది..నీ జ్ఞాపకాల ఒడిలో ఈ జీవితం ఇలాగే గడిపెయ్యోచ్చని
కామెంట్‌లు
నా కనుల కొలనులో ఉహల నావపై నీ జ్ఞాపకాల kalalu విహరించినా......




నా మనసు తోటలో నీ నవ్వుల పువ్వులు వికసించినా......



నా ఎదలో నీ సిరిమువ్వల పాదాల సవ్వడి వినిపించినా ......



నీ నయన కాంతులకు నా హృదయ చక్షువులకు మెలకువ వచ్చినా...



నా జీవన ఎడారిలో తొలకరి జల్లులా నీ సాన్నిత్యం నన్ను తన్మయ పర్చినా....



నా హృదయ సంగీతానికి మయురంలా నీ పాదాలు నర్తించినా.....



నా హ్రుధయాశడంలో నీ మనసు మేఘాలు రాగాలు పలికినా....



అందని జాబిలి లాంటి నీ మనసులో నాకు చోటు దక్కినా...అదే నాకు హృదయ ప్రమోదము .....అదే నాకు జన్మ సాఫల్యము.....
కామెంట్‌లు
కోరికలనే గుర్రాలకు రెక్కలోస్తే సప్త సముద్రాలను దాటి వస్తా నీకోసం విహంగాన్నై....




జ్ఞాపకాలనే అలలకు ఉప్పెనోస్తే దాటిస్తా నిన్ను జీవన సంద్రంలో నావనై...



జాబిలి లాంటి మనసు నిదయితే అనుక్షణం దాన్ని కాంతిమయం చేస్తా దినకరుడినై...



కోకిల లాంటి స్వరం నిదయితే జీవితాంతం నీ పాట వింటా వసంతాన్నై...



నింగి లోని మేఘం లాంటి నవ్వు నిదయితే నీకోసం వేచి వుంటా మయురాన్నై...



అందని ఆకాశం లో తరావు నువ్వయితే నిన్ను నాలో కలిపెస్తా...పాలపుంతనై....



చెలీ...నా ప్రేమకు స్పందించే హృదయం నీ కుందంటే...వేచి వుంటా వేయి జన్మలయినా నీకోసం నిర్మోక్షుడినై......
కామెంట్‌లు
కన్నుల్లో నీ రూపు కరిగి కన్నీరుగా మారి చెక్కిళ్ళపై జారింది ,


గుండెల్లో నీ ఊసు ఊహగా మారి ఊరించ సాగింది ,

నీ జాడ కోసం నా పాదమే పక్షిగా మారి ఊరంతా తిరిగింది ,

నీ రాక కోసం నా కంటిపాపే కలువలా మారి ఎదురుచూసింది ,

నీ మాట కోసం మదిలోన భావం మెరుపుగా మారి మురిపించ సాగింది ,

నీ చెలిమి కోసం నా పిలుపే నీ తలపుగా మారి తపించ సాగింది ,

నిను చూడగానే నా మోము మరు మల్లెగా మారి విరబుయ్య సాగింది





నా ఆశ నీవే నా శ్వాస నీవే ,

నా ఊహ నీవే నా ధ్యాస నీవే ,

నీవు లేక నేను జీవించలేను ,

నీవు లేని నన్ను ఊహించలేను ,

కనుక ఇన్నాళ్ళ మన స్నేహానికి కానుకగా ,

నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను సంతోషంగా :)

నా దరి చేరమని, నను బ్రతికించమని...........

కామెంట్‌లు
కమ్మగా పాడే కోకిలను అడిగాను


నీ తీయని మాటలతో మురిపించేది ఎపుడని

చల్లగా తాకే చిరుగాలిని అడిగాను

నీ చల్లని చూపుతో తాకేది ఎపుడని

వర్షించే మేఘాన్ని అడిగాను

నీ నువ్వుల జల్లుల్లో తదిచేది ఎపుడని

హైఇని పంచే వెన్నెలను అడిగాను

ఆ వెన్నల్లో ఊసులాడేది ఎపుడని

పరుగులు తీసే సెలయేటిని అడిగాను

నీ పరుగు నా కోసమేనా? అని

నాలో ఉన్న నా ప్రాణమైన నిన్ను అడిగాను

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని

నా దరి చేరమని, నను బ్రతికించమని
బుధవారం, ఆగస్టు 26, 2009 కామెంట్‌లు
మంగళవారం, ఆగస్టు 25, 2009 కామెంట్‌లు
నా హృదయం లోని ఆవేదనను నీకు చెప్పాలని
సాగరం లో ఎగసిపడే అలలా నీ దరికి వస్తాను...
కానీ ఈ చిన్న మనసుకేం తెలుసు
హృదయమే లేని చోట ప్రేమను వెతకటం
అత్యాశ అని ....?
నిరాశతో తిరిగి అలలా వెనక్కి వెళ్ళిపోతాను
మళ్ళీ పుడుతుంది వింత కోరిక.....
నా మనసులో మాట చెప్పాలని
మళ్ళీ కెరటం లా నీ దరికి వస్తాను
కానీ అప్పటికి కూడా తెలియదు నా మనస్సుకి
నీ గుండెలో ప్రేమ ఎండమావిలో నీరు అని ....
అంతే...
మళ్ళీ తిరిగి
వెనక్కి వెళ్ళిపోతాను....
వేగంగా...
నిరాశతో......

అక్షరాలూ రాని నన్ను అక్కున చేర్చుకున్నావు

ఆదివారం, ఆగస్టు 23, 2009 కామెంట్‌లు
అక్షరాలూ రాని నన్ను అక్కున చేర్చుకున్నావు
ప్రేమంటే తెలియని నన్ను
'ప్రేమను పంచె ' మనిషిగా మార్చావు
కష్టాల్లో వున్నా నన్ను కరుణించావు
ఆపదలో వున్నా నన్ను ఊధర్చావు
నేను మరణించే సమయంలో మరుజన్మనిచావు
అన్నింటా నన్ను ఆదర్శవాదిగా చూపావు...........
ప్రేమ నీకు జన్మజన్మలకు రుణపడి ఉంటా నీవాడిగా.................

నాలో వునాది నువ్వేగాః ....

కామెంట్‌లు
నాలో వునాది నువ్వేగాః ....

నువ్వు నేను ఒక్కటేగాః ....

వుండే చోటులు వేరు అయినః ....

నా మనసంత నువ్వేగాః ....

నడిచే దారులు యెనీ అయిన ...

నన్ను నడిపించే తెజాం నువ్వేగాః ....

క్షణాలు గడవాని ...యుగాలు గడవాని ....

నా మది లోని రూపాం చెరగదుగాః .......

ఆశలు మూగవొయినాక కానీ తెలియలేదు..

కామెంట్‌లు
ఆశలు మూగవొయినాక కానీ తెలియలేదు..
నా గుండె పిలుపు నీవు వినలేదని.
అలలు తీరాన్ని తడిపినాక కానీ తెలియలెదు..
నీ అడుగులకై అన్వేషించానని.
మసక చీకట్లొ..కంటి చివర...
ఓ కన్నీటి బొట్టు జారినాక కానీ తెలియలేదు ఒంటరితనం నన్నావహించిందని.
నీ దారిన పెనవేసుకున్న నా చూపు..నిరాశతొ వెనుతిరిగే వరకు తెలియలేదు..
నాకోసం నువ్వు రావని.
నిను వలచిన నా హ్రుదయం పగిలినాక కానీ తెలియలేదు...
ప్రణయమంటే వేదన అని.
కామెంట్‌లు
హృదయపు తలుపులు తెరిచి ప్రేమ ముంగిట
నీ రాకకై ఎదురు చూసినా నాటి నుండి నేస్తం
నా కనుల మాటున దాగిన సుమధుర స్వప్నం
ముగ్ధమనోహర నీ రూపమేనని తెలియలేదా
నీ గుండె గది లో ఈక నాకు చోటు లేదని తెలిసినా
నా గ్నాపకాల గూటి లో నిన్ను పదిలంగా ఉంచానంటే
నీ పై నా ప్రేమ అపరామయినదని తెలియలేదా
నీవు తెలుసన్నా,తెలియదన్నజరిగింది ఘోరం
నీ ఎడబాటు నా జీవితానికే ఒక పెద్ద శాపం
నీవు దూరమయ్యవనే నిజం నన్ను బాదిస్తున్న
నీవు నాతోనే ఉన్నావనే అందమయినా అబద్డంతోనే
జీవించే ఉన్నా జీవచవంలా........
మరిచిపోదామని మనసునడుగుదామంటే
మరపురాని గతం చేదు నిజమై నన్ను పరిహసిస్తోంది
"మీరు" , "నీవు" గా మారినా నిన్ను నన్ను .."మనం " గా
మార్చలేని నా హృదయం ఒక రోజు మూగబోతే
నా యెద సవ్వడి వినటం మరువకు చెలి
ఎందుకంటే అది మిగిల్చిన చివరి చప్పుడు
నీ పేరే పలుకుతుంది .......