స్నేహం

శనివారం, ఆగస్టు 29, 2009 కామెంట్‌లు
జాతి,కుల, మత సరిహద్దులు లేని విశాలమైన సామ్రాజ్యం స్నేహం
తనను ఆశ్రయించిన వారి భారాలను దించి సేద తీర్చే ఉద్యానవనం స్నేహం

ఒంటరిగా తనను చేరిన మనసుకు ఎన్నో మనసుల తోడు నిచ్చే ఆశ్రమం స్నేహం

ఎంత చిలిగిన అమృతం మాత్రమే ఇచ్చే పాల సముద్రం స్నేహం

తప్పులను సరిచేసి విజయాలను ప్రోత్సహించి మనుషులను మనుషులుగా మార్చే విద్యాలయం స్నేహం

తరాలు మారిన యుగాలు గడిచిన తరిగిపోని బండాగారం స్నేహం

తనకు సొంతరూపం, ప్రాణం లేకున్న అందరికి రూపనిచ్చి ప్రాణంగా నిలిచేది స్నేహం....

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి