కాసింత చోటు కల్పించవూ.......

శనివారం, ఆగస్టు 29, 2009 కామెంట్‌లు
మంచి అనే ఉద్యానవనంలో వికసించిన కుసుమానివో


మది అనే నదిలో ప్రవహించే అమౄతానివో

మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో

మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...



మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో

వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో

జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో

వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...



ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో

స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో

మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో

అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో...



చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు

నేను ఎల్లపుడూ సిద్ధం

మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే

కలిసి పయనిద్ధాం

నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన

అర్ధాన్నందించిన ఓ స్నేహమా

అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడా

కాసింత చోటు కల్పించవూ....

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి