ఒంటరితనపు వెన్నెలలో మనసు వేదనతో వణుకుతుంటే,
చెలిమాటలు చలిమంటలై నునువెచ్చగ తాకుతుంటే,
అరుణమై అస్తమిస్తున్న ఆశ కూడ ఊపిరందుకోని ఉదయిస్తుంది.
శిదిలమై జారిపోతున్న సంతోషం కూడ పెదవిపై పదిలమవుతుంది.
ఇరుమనసుల సంగమంలో చిరునవ్వు చిగురిస్తుంది.
చెలివలపుల తాకిడితో మదిలో తొలిప్రేమ తుళ్ళి ఆడుతుంది
చెలివలపుల తాకిడితో మదిలో తొలిప్రేమ తుళ్ళి ఆడుతుంది..........
శుక్రవారం, జులై 23, 2010
కామెంట్‌లు
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
9:53 PM
కరుణించని చెలీ... నీకోసం ఓ లేఖ .........
శుక్రవారం, జులై 16, 2010
కామెంట్‌లు
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
7:37 PM
ఊహల్లో నీతో కలిసి వేసిన అడుగులు నా మదిలో ఇంకా శాశ్వతంగానే ఉన్నాయి. నా సమక్షంలో నిన్ను ఊహిస్తూ కన్న కలలన్నీ చెరగని జ్ఞాపకాల్లా ఇంకా నను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ నీవు మాత్రం ఎందుకో మౌనం చెదరిని తపస్విలా ఇంకా అలాగే ఉన్నావు.
చెలీ అసలు నీకు తెలుసా...? నీకోసం ఎదురుచూస్తూ నేను కూర్చున్న అరుగుసైతం నావంక ప్రశ్నార్థకంగా చూస్తోంది. ఎప్పటికైనా నేను నీ ప్రేమను జయించగలనా అని దాని సందేహం కాబోలు...?. నీకోసం మౌనంగా ఆలపించిన గీతాలు, నిన్ను తలచి నేను రాసిన పిచ్చి రాతలు సైతం నన్ను చూసి జాలిపడుతున్నాయి. నేను రాసిన ఆ రాతలు నాగురించి నీలో కొంచమైనా జాలి కలిగించలేదేమని...?.
మల్లె పందిరిలోని పువ్వులు సైతం పక్కుమంటున్నాయి. ఏదీ నీ ప్రేయసి వచ్చిందా... ఆమె నడిచే దారిలో రాసులుగా పోస్తానంటూ గొప్పగా చెప్పావే అంటూ...?. చివరకు నీవల్ల నాలో చిగురించిన ప్రేమ సైతం నన్ను చూచి చాటుగా నవ్వుకుంటోంది. ఎన్నాళ్లైనా నా ప్రేమకథలో నెనొక్కడినే మిగిలిపోతానేమోనని దానికి సందేహం అనుకుంటా...?
కానీ ఎవరేమి అనుకున్నా... ఎవరెన్ని చెప్పుకున్నా... నా జీవితానికి భవిష్యత్ అంటూ ఉంటే అది నీతోనే... నా ప్రేమ పుస్తకంలో పేజీలంటూ ఉంటే వాటి నిండుగా నేరాసేది నీ పేరే... చెలీ నా ప్రేమకు నీవు చలించకున్నా... నాపై నీలో ఏనాటికీ ప్రేమ చిగురించకున్నా... చివరకు నా ఉనికిని సైతం నీవు గుర్తించకున్నా... నేను మాత్రం నీకోసం ఇలాగే... ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటా... కరుణించి నను చేరుకున్నా నీఇష్టం... ఆగ్రహించి నన్ను శపించినా నీఇష్టం... ఎందుకంటే నీకు ఇష్టమైనదేదైనా నాకు చాలా ఇష్టం...
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
7:34 PM
మూ(మ)గ మనసు
కటువైన మాట ప్రేమించలేదని కాదు
నిశ్శబ్దం నవ్వలేదని కాదు
యేడుపెరుగని గుండె బండరాయి కాదు
భయపడనంతనే ధైర్యపు కొండ కాదు
పంచనామా చేసి చూడు
నీకు లేని భావాలూ చూడచ్చు
నీకు తెలియని త్యాగాలూ నేర్వచ్చు
గుండెల్లో అగ్నిపర్వతం నిశ్శబ్దమై పేలుతుంది
అవాజ్యమైన మమకారం అధికారమై ధ్వనిస్తుంది
సడలిన గుండె బిగువు చాటుగా యేడుస్తుంది
గొంతు చించుకు అరచినా
గుండె పగిలి యేడ్చినా
ఈ మగాడిననే అడ్డు గీత ఆవలివైపే
పైకి కనిపించే నేను నేను కాదు
మనిషిలా ఇవతల పర్వతం
మనసులా అవతల మంచు పర్వతం
కనుదాటక రెప్పల మాటున దాచిన నాకన్నీళ్లు....
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
7:31 PM
కనుదాటక రెప్పల మాటున దాచిన నాకన్నీళ్లు
ఇపుడు ఎగసే అలలుగా మారి ప్రశ్నిస్తున్నాయి
నిన్ను ధ్యానించే పెదవికి ఈ మౌనమేమిటని ?
నిన్ను పూజించే ఎదలో ఈ విరహమేమిటని ?
ఏమని బదులివ్వను నా ఆరాధ్యదేవతా..!
నువ్వు విడిచిన నా మది శూన్యమాయే
నిన్ను పొందని నా హృది మూగబోయే
తొలకరి చినుకువు నువ్వేనాకు ప్రళయపు సెగలను సృష్టించకే
మిగిలిన బ్రతుకువు నువ్వే నాకు పసిప్రాయపు కలలను కూల్చేయకే
ఈ జన్మకు తోడువు కావా ..............
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
7:24 PM
నా ఆశలు నీలాకాశం
నాచూపులు తారల కోసం
ఆ తారల వెలుగువు నీవు, నా మదిలో ఉదయంతేవా
నా భవితకు మార్గం నీవు, ఈ జన్మకు తోడువు కావా
గడచిన కాలం ఎంతో తెలియదు
నేను నడచిన దూరం నీ వరకు
మిగిలిన జీవితం ఏమౌనో తెలియదు
నా దేహపు చలనం నీకొరకు
నేను గుర్తును అవుతా నీ గతమున కొలువై
నేను సాక్ష్యం అవుతా నీ రేపటి కలనై
నా ఎద వాకిలి నీకై తెరిచుంచాను
నువ్వు వరమయి వచ్చి నాకై మోక్షం కావా.........
నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా.....
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
7:03 PM
నువ్వే నేననుకున్నా,
నా నవ్వే నువ్వనుకున్నా.
కనులకు కనబడకున్నా,
కన్నీటితో కనిబెడుతున్నా.
రాయభారమే వద్దనుకున్నా,
హృదయభారమే మోసేస్తున్నా.
విరహమై నను వేదిస్తున్నా.
దూరమై నిను గమనిస్తున్నా,
ఈ బంధం కలువదని తెలుస్తున్నా,
నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా
నా మనసు నీకు తెలిపేదేలా .......
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
6:56 PM
నింగిలో తారలా వెలగనా, నేలపై చినుకులా రాలనా
నే మేఘమై వర్షించి నిను మైమరిపించనా
చిగురించే కొమ్మనై అలరించనా
నిను మురిపించ మయూరమై నర్తించన
నువు ఆలకించ కోకిలనై ఆలపించన
నిను మరిపించ సుమమై వికసించి తావినై చేరనా
నువు పవలించ పచ్చని పైరుతో పాన్పుగా మారనా
నిను సేదతీర్చ చిరుగాలినై సేవించనా
నువు పరవశించ సెలయేటి సయ్యటానై సాగనా
కలతన్నదే లేని కలిమిని
చెరగని చిరునవ్వుకి చెలిమిని
నీ ఏకాంతం లో మౌనమునై
నీ జీవన పయనములో నీడనై నీ వెంట సాగనా
నీకై తపించు నా ప్రేమ నిను చేరేదెలా
నా మనసు నీకు తెలిపేదేలా .......
నిను చేరు క్షణం కోసం వేచివున్న నేస్తమా...... నా ప్రాణమా....






