శుక్రవారం, జులై 16, 2010
కామెంట్‌లు
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
7:34 PM
మూ(మ)గ మనసు
కటువైన మాట ప్రేమించలేదని కాదు
నిశ్శబ్దం నవ్వలేదని కాదు
యేడుపెరుగని గుండె బండరాయి కాదు
భయపడనంతనే ధైర్యపు కొండ కాదు
పంచనామా చేసి చూడు
నీకు లేని భావాలూ చూడచ్చు
నీకు తెలియని త్యాగాలూ నేర్వచ్చు
గుండెల్లో అగ్నిపర్వతం నిశ్శబ్దమై పేలుతుంది
అవాజ్యమైన మమకారం అధికారమై ధ్వనిస్తుంది
సడలిన గుండె బిగువు చాటుగా యేడుస్తుంది
గొంతు చించుకు అరచినా
గుండె పగిలి యేడ్చినా
ఈ మగాడిననే అడ్డు గీత ఆవలివైపే
పైకి కనిపించే నేను నేను కాదు
మనిషిలా ఇవతల పర్వతం
మనసులా అవతల మంచు పర్వతం

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి