ఎవరు నీవు అందమా?

శుక్రవారం, సెప్టెంబర్ 23, 2011 కామెంట్‌లు


ఎవరు నీవు అందమా చిరు నవ్వుల చిత్రమా
మధిన పలుకు బావమా మురిపించుట బావ్యమా?
సిరివెన్నెల సిరల నుండి జాలువారిన కవిత్వమా..
గిరికన్నుల ధరుల నుంచి ప్రవహించే జలపాతమా..
దివిసీమల లోననుండి దిగివచ్చిన అప్సరవా..
వినీలతల ఆవాలన విహరించే గాంధర్వ కన్యవా..
రవివర్మ కుంచే నుండి ఉదయించిన రంగవల్లికవా..
జక్కన్న ఉలి నుండి మలచబడిన నవ శిల్పానివా..
కాళిదాసు కలము నుండి జన్మించిన కావ్యానివా..
అన్నమయ్య గలము నుండి వినిపించిన కీర్తనావా..
ఎవరు నీవు అందమా.. మధిలోని కలల రుపమా..
నను వేధించుట బావ్యమా..నీ చిరునామా చెప్పుమా

నాలో ప్రేరణ

కామెంట్‌లు


ప్రియా..
నీ చిరునవ్వుల సంగీతం నా మదిలో నిండినది,
ఆ నవ్వే రోజంతా నను నవ్విస్తుంటుంది.
నీ అరవింద వదనం నాలో వెలుగులు నింపినది,
ఆ నగుమోమె నాకు ఉల్లాసమిస్తుంది.
నీ తేనెల తియ్యని మాటలే స్నేహం నాకు పంచేది,
ఆ స్నేహమే నాకు ఉత్సాహమిస్తుంది.
నీ నిర్మల ఆప్యాయత నను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది,
ఆ అనురాగమే నను నడిపిస్తున్నది.


ఈ సంగతి.. నీకు సమ్మతమో, కాదో గాని, నీ రూపం గుండె నిండుగా నిండింది నేడు !
ఈ భావన.. ప్రేమో కాదో తెలియదు గాని, నీ ధ్యాసే నా శ్వాసగా మారిందీనాడు...!

తీపి వేదన

కామెంట్‌లు


ఓ ప్రియతమా ఇటు చూడుమా.. నీ కోసమే వేచున్నా...
నవనీతమా వర మివ్వుమా ..నా యదల్లో నీవన్నా..
నా ప్రాణమే నీవన్నాను..నీ కోసమే బ్రతికున్నాను..
నా హృదయమే నీదన్నాను..నా జీవితం ఆర్పిస్తాను...


నిను చూసిన రోజే ..నా లయ పెరిగింది..
నువు పలికిన రోజు ..అది గతి తప్పింది..
నీ చూపుల కోసమే ..నా ఎదురు చూపులు..
నీ మాటల కోసమే ..నా ఆశల తపనలు..


నా ప్రేమ తెల్సుకోకున్నా.. నీ చూపులు చాలు లేవమ్మా..
నీ ప్రేమ తెల్పలేకున్నా..నీ మాటలు చాలు లేవమ్మా..


నీతో స్నేహం తర్వాతే ..ప్రేమంటే తెలిసింది..
నీ అనురాగంతో ..నీపై ఆరాదన పెరిగింది..
నీ రాక కోసమే ..నా గుండె లోగిల్ళు..
నీ తోడు కోసమే ..నా ఊహల ఉప్పెనలు ..


నను ప్రేమించ లేకున్నా.. నీ స్నేహం నాకు చాలమ్మా..
నీ నీడ నే కాలేకున్నా..ఆ బావన నాకు చాలమ్మా..

నన్ను కదిలిస్తునే ఉంది....!

కామెంట్‌లు: 1


దీనంగా.. మౌనంగా.. మాష్టారు చెప్పేది వింటూ కనిపించింది....
ఒక్క క్షణం నాకేమయ్యిందో నాకే అర్ధం కాలేదు.. అలా ఉండిపోయా....
తనని తనివి తీరా చూడాలని నా కన్నుల వేట మొదలయ్యింది....
ఒక్క సారిగా ఉలిక్కి పడ్డా.. తన చూపు నన్ను తడిమినప్పుడు....


తనని మళ్ళి మళ్ళి చూడాలని మనసు ఉవిళ్ళు ఊరుతోంది....
ప్రతీ సారి అలలు తీరాన్ని తాకాలని ప్రయత్నించినట్టు సాగింది నా చూపు....
గమనిస్తూనే ఉన్నాను.. తను తన పనిలో నిమగ్నమయ్యింది....
మంచి తరుణం మించినా దొరకదు, తన అందాన్ని నా కన్నుల్లో బంధించా....


తన పాదాలు తరుగు పెట్టిన పాల రాతిలా స్వచ్చంగా ఉన్నాయి....
ఆ పాదపద్మాలపై తలను వాల్చి సేదతీరాలని అనిపిస్తుంది....
తన అణువణువులో అందాలు వస్త్రాల తెర చాటున తాండవిస్తున్నాయి....
ఆ వస్త్రాలకు అందం ఆమె ఒంపు సొంపుల వల్లే వచ్చి ఉండాలి....


మచ్చలేని మోము.. ఎర్రని పెదాలు.. స్వచ్చమైన నవ్వు ఆమె సొంతం....
మంత్రముగ్ధమైన మనోహర రూపాన్ని చూస్తూ నన్ను నేను మర్చిపోయా....
కొన్ని క్షణాలకు ఆమె లేచి దేవకన్యలా నా ముందు నుంచి వెళ్ళిపోయింది....
తాను వెళ్ళినా తన రూపం కన్నులలో కదుల్తునే ఉంది... నన్ను కదిలిస్తునే ఉంది..
శుక్రవారం, సెప్టెంబర్ 02, 2011 కామెంట్‌లు


ఓ ముల్లు గులాబినీ ప్రేమించింది



నేనో అద్బుతాన్ని సృష్టించాలనుకున్నాను
నేనో అందమైన గులాబీని సృష్టించాను
కానీ ఇంతలో ఓ ముల్లు గులాబినీ ప్రేమించింది
గులాబీ రేకుల్ని తడిపిన మంచుబిందువులతో తన దాహార్తిని తీర్చుకునేన్తగా......  
ఆ పుష్పం వదిలే ప్రతి నిశ్వాస ను తన శ్వాస గా మార్చుకునేన్తగా .

నేను తనకి ఆత్మ గౌరవ సిద్ధాంతాలు చెప్పి చూసాను                                                         
ప్రకృతి నియమాల గురించి సుదీర్ఘోపన్యాసం ఇచ్చి చూసాను
అయినా మట్టి బుర్రకి మానవతా విలువలు తలకేక్కితేగా .


తనకి తెలుసు తుమ్మెదల ఝుంకారాన్ని ప్రేమించే సుమం తనను ప్రేమించదని.....
తనకి తెలుసు కుసుమ సాన్నిహిత్యం తప్ప తన జీవితానికి వేరే అర్ధం లేదని ....
చివరికి నేను వరమివ్వక తప్పలేదు ......గులాబీ మొక్కకా ముల్లు తప్పలేదు.........
కామెంట్‌లు

స్నేహం

జాబిలి పంచే చెలిమికే కలువ రేకులు వికసిస్తాయని ............
సూర్యుడు పంచే చెలిమి వెంటే ప్రొద్దు తిరుగుడు పయనిస్తుందని ............
తెలిసిన వాడే స్నేహితుడంట .......మనసు తెలిసిన వాడే మన తోడంటా................

ఎన్ని ప్రేమలు తమ పవిత్రతను ప్రశ్నించుకున్నాయో ......................
మోహపు జాడలు లేని ఈ ప్రేమను చూసి ..............
ఎన్ని బంధాలు తమ అనుబంధాన్ని శంకిన్చాయో .............
రక్తపు పంపకాలు జరగని ఈ బంధాన్ని చూసి .................

ఎన్ని కాలాలు ఎంతగా కక్ష కట్టాయో...........
ఊసు పోని కబుర్లు తమని కరిగించే సాధనాలని తెలుసుకొని .................
ఎన్ని లోకాలు ఎంతగా కుల్లుకున్నాయో ...............
ఎదురయ్యే ప్రతి కవ్ష్ట నష్టాల భారం సగమైపోతుందని ..........

నీ ఆత్మను వివస్త్రను చేయాలని వుందా ...........
నీ మనసు నవ యవ్వనం సంతరించు కోవాలని వుందా .........
అయితే స్నేహం చెయ్
కామెంట్‌లు

నీ కోసం రాస్తాను

ప్రపంచ బాషల్లోంచి అందమైన అక్షరాలను మాలగా అల్లి 
                                     నీ మెళ్ళో దండగా వేస్తాను .........

నీ పేరుతో ఓ కావ్యం రాసి , దాన్ని నీకే అంకితమిచ్చి ,

                                     నీకు మాత్రమె వినపడేలా రోజూ చదువుతాను .......

నీకో ప్రేమ నిఘంటువును బహుమతిగా ఇస్తాను .......

నీ కోసమే పలికే ప్రతి మాటను పదకవితగా మారుస్తాను ......

                                    నీ కోసం రాస్తాను ........

నువ్వు కాదన్న రోజున అక్షర సన్యాసం చేస్తాను ..........
కామెంట్‌లు

ప్రియా ... నా పై అoత మక్కువ అని తెలుసుకోలేక పోయా

ప్రియా ... నా పై అoత మక్కువ అని తెలుసుకోలేక పోయా
జీవన వాగులో దిశ లేకుండా కొట్టుకుపోతున్న దశలో
చేయూతనిచ్చి జీవన పయనంలో తోడయ్యావు
నా ఆశయాలు అడవిలో కాచిన వెన్నేలవుతుంటే
నీ వాణితో నాలో సంకల్ప కణాలనే రాజేసావు
రాళ్ళ బాటలో కుసుమానివై నా పాదం కింద నలిగావు
పూల బాటలో పుష్పగుచ్చానివై ప్రశంసిచ్చావు
అందని అధిరోహలికే ప్రతి అడుగులో మెట్టువై ఎక్కించావు
అంధనం ఎక్కిన నేను వెనుతిరిగి చూస్తే నీవు కానరావే
ఆవేదనను ఆధ్యంగా ,
ప్రేమనే జ్యోతిగా ,
ఆదిరోహం ఎక్కిన ప్రతి మెట్టు ఆనవాలుతో
నీకై అన్వేషణ సాగించాను ...
ప్రియా ... తరాసపడినావు
ఆశగా వెతికిన మనసుకి ఆవేదన మిగులుస్తూ
పిచ్చి నా మనసు గ్రహించనే లేదు
పయనం మద్యలో ఆగిన నీ అడుగుని
ఊహనైన నన్ను వీడవనే నమ్మకమేమో
మిగిలిన నా పయనంలో నువ్వు లేకున్నా ఉన్నట్లే అనిపించింది


ఆయినా నాకు తెలిలేదు సుమా ...
నా పై నీకు ఇంత మక్కువని


నా ఆశయ పయనంలో నీ అలుపుని
నీ రక్తంతో బ్రహ్మ రాతని చెరిపి నాకు ఉన్నతమైన స్థాయిని రాసావని


దైవంతో పోరాడి ఘఘనానికి ఏగక
స్వర్గాన్ని వీడి
నాకై ధరణి పై తోడుగా ఉన్నావా నేస్తమా
మూడడుగుల లోతులో
నీ సహాచర్యంలేని నాకు
నీతో సహాగామనమే మేలు
నీకై వస్తున్న ప్రియతమా