నీతో కలిసి నడిచే కొంత దూరం........

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009 కామెంట్‌లు
నీతో కలిసి నడిచే కొంత దూరం కోసం ఎంత కాలమిన ఎదురు చూస్తాను ..
నువ్వు వదిలే శ్వాస న ఊపిరాయి..
ని చిరునావు న గుండె చపుడాయి..
ప్రతి క్షణం ని నిరీక్షణ, ప్రతి క్షణం ని అన్వేషణ..
నిను వదిలి వుండలేక ..
ని మాట వినకుండా బ్రతకలేక..
ని చూపు కోసం తపిస్తూ..
ని పిలుపు కోసం ఎదురు చూస్తూ..
ఎందరిలో వున నిగ్నపకలే...
ఎంత మందిలో వున ని ఆలోచనలే...
నువ్వు వదిలి వెళ్ళే క్ష్నంవచే నకన్నేల్లు,
నువుదూరమవ్తవని బాధ...
నువ్వు లేక నేనున్డలేక.......

ఎలా తెలుపను...

కామెంట్‌లు


నువ్వు లేని ఈ క్షణం ఎంతో భారం అది ఆనందపు మిళితమైన,
నువ్వు లేని ఈ హృదయం ఎంతో కఠినం అది ఎంత సుకుమారమైన,
నువ్వు లేని ఈ జీవితం ఎంతో వ్యర్ధం అది ఎంత విలువైనదైనా,
నువ్వు అన్నే నన్ను నీలో చూసుకోవాలని ఈ ఆరాటం ఆ సంద్రం కెరటానీదా లేక నీ ప్రేమ దా,
నీ ప్రేమదే అనీ నా గుండె సవ్వడి నీరంతరం అంటుంది .......
అనీ నీకు చెప్పాలని ఆశ.. ....
కానీ నీ మాటలు నన్ను మౌనిని చేస్తున్నాయి...
నన్ను మైమరిపిస్తున్నాయి ......

అపుడు అనిపించింది ఇంకా నాలో నేను లేనని....మొత్తం నువ్వనీ .....
అనుమతైన అడగని నీపైన కోపం తెచ్చుకోవాలి అనీ ...
కానీ..
ఎలా తెలుపను....
కామెంట్‌లు
కనులనోని కావ్యమై

కనిపించని గమ్యమై

కన్నీటి గానమై

కాలరాచే కష్టమై

కబళించే ప్రళయమై

కనిపించని గానమై

నను వేధించావు

నా వేదన రూపమైన

ఈ కవితను నీకే అర్పిస్తున్నా.....కాని

ఎన్నటికి నిను మరవనని మాటిస్తున్నా

నా జీవిత గమ్యానికి ఊపిరి నీవు.............

కామెంట్‌లు
నా జీవిత గమ్యానికి ఊపిరి నీవు

నా పలుకుల భావానికీ అర్ధం నీవు

నా ఆనందాల క్షణాలకి ఆకాంక్షవు నీవు

నా ఆవేశానికి అణుకువ నీవు

నా నడకల పయనానికి గమనం నీవు

అలాంటి నిన్ను.....

ఏ దారని వెతకాలి , ఏ దిక్కున పయనించాలి

బంగరు వన్నెల చిలకా..

కామెంట్‌లు
బంగరు వన్నెల చిలకా..
పచ్చని నీ పయనంలో..
ఏది శాశ్వతం ఏది జ్ఞాపకం?
నచ్చినవన్ని నెడుతూ ముందుకు దూకే నీ జీవిత గమనంలో..
ఎన్నెని పరిచయాలు ఎన్నెని పంజరాలు...!
అన్నింటిని తెంపి అన్నింటిని మరిచి
ముందుకు సాగే నీ ప్రయాణంలో..
నీది అంటూ ఏమి మిగలక
ఓ స్నేహ హస్తం కోసం సతమతమవుతున్న ఓ చిలకా.....
నా దరి చేరకు నన్ను పిలవకు
నాది నీ బ్రతుకే అని మరువకు....

నేను నీవని నేను కాదని నన్ను నమ్మించావు...

కామెంట్‌లు
నేను నీవని నేను కాదని నన్ను నమ్మించావు...
నీ తలపుతో నీ వలపుతో నన్ను కవ్వించావు..
నాది ఏది లేదని, ఉన్నదంతా మనమని పిచ్చివాడిని చేసి..
నేను నేనని మనము వేరని నా కళ్ళు తెరిపించావు..
నీవు నీవుగా నేను వేరుగా నన్ను కబలించావు..
నీ తలపుతో నా గతముతో జీవించమన్నావు...!

కనుపాప లోని కన్నీటిలా కనిపిస్తావు ..

కామెంట్‌లు
కనుపాప లోని కన్నీటిలా కనిపిస్తావు ...
కమ్మని కావ్యంలా మురిపిస్తావు...
వెచ్చని శ్వాసవై కరిగిస్తావు..
కోకిల గానమై నన్ను మరిపిస్తావు..
ప్రపంచమంతటి ప్రేమని కురిపిస్తావు..
కాని ఇంతలో..
కన్నీటి పోరవై కనిపించకుండా మాయమైతావు...
కలల బ్రతుకులో విడిచి వేదిస్తావు..
కామెంట్‌లు
నిదురిస్తున్న రేయి ఎదురుచూసేది ఉదయం కోసం
నిదుర లేచిన నా నయనం ఎదురుచుసేది నిన్ను చూసే క్షణం కోసం
అదరాలు కదిలేది మాటల సడి కోసం
నా పెదవులు సడి లేక మౌనమైంది నీ తీయని ముద్దు కోసం
గుండె చేసే అలజడి ప్రాణం కోసం
నా ప్రాణమైన నువ్వు నా గుండె గుడిలో నిదరోవడం కోసం
కరములు చలించేది అన్ని అవసరాల కోసం
నా చేతుల అవసరం నిన్ను దగ్గరికి తీసుకొనే వెచ్చని కౌగిలి కోసం
పాదాల పయనం జీవిత గమ్యం కోసం
నా అడుగుల గమనం నిను చేరుకొనే ఆస కోసం ......

నీకోసం........................

కామెంట్‌లు
కోరికలనే గుర్రాలకు రెక్కలోస్తే సప్త సముద్రాలను దాటి వస్తా నీకోసం విహంగాన్నై....

జ్ఞాపకాలనే అలలకు ఉప్పెనోస్తే దాటిస్తా నిన్ను జీవన సంద్రంలో నావనై...

జాబిలి లాంటి మనసు నిదయితే అనుక్షణం దాన్ని కాంతిమయం చేస్తా దినకరుడినై...

కోకిల లాంటి స్వరం నిదయితే జీవితాంతం నీ పాట వింటా వసంతాన్నై...

నింగి లోని మేఘం లాంటి నవ్వు నిదయితే నీకోసం వేచి వుంటా మయురాన్నై...

అందని ఆకాశం లో తరావు నువ్వయితే నిన్ను నాలో కలిపెస్తా...పాలపుంతనై....

చెలీ...నా ప్రేమకు స్పందించే హృదయం నీ కుందంటే...వేచి వుంటా వేయి జన్మలయినా నీకోసం నిర్మోక్షుడినై......
కామెంట్‌లు
కన్నుల్లో నీ రూపు కరిగి కన్నీరుగా మారి చెక్కిళ్ళపై జారింది ,
గుండెల్లో నీ ఊసు ఊహగా మారి ఊరించ సాగింది ,
నీ జాడ కోసం నా పాదమే పక్షిగా మారి ఊరంతా తిరిగింది ,
నీ రాక కోసం నా కంటిపాపే కలువలా మారి ఎదురుచూసింది ,
నీ మాట కోసం మదిలోన భావం మెరుపుగా మారి మురిపించ సాగింది ,
నీ చెలిమి కోసం నా పిలుపే నీ తలపుగా మారి తపించ సాగింది ,
నిను చూడగానే నా మోము మరు మల్లెగా మారి విరబుయ్య సాగింది ||


నా దరి చేరమని, నను బ్రతికించమని......

కామెంట్‌లు


కమ్మగా పాడే కోకిలను అడిగాను
నీ తీయని మాటలతో మురిపించేది ఎపుడని
చల్లగా తాకే చిరుగాలిని అడిగాను
నీ చల్లని చూపుతో తాకేది ఎపుడని
వర్షించే మేఘాన్ని అడిగాను
నీ నువ్వుల జల్లుల్లో తదిచేది ఎపుడని
హైఇని పంచే వెన్నెలను అడిగాను
ఆ వెన్నల్లో ఊసులాడేది ఎపుడని
పరుగులు తీసే సెలయేటిని అడిగాను
నీ పరుగు నా కోసమేనా? అని
నాలో ఉన్న నా ప్రాణమైన నిన్ను అడిగాను
నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని
నా దరి చేరమని, నను బ్రతికించమని......

కన్నీటి ధార.........

కామెంట్‌లు


ఎగసి పడే భాధనంత
కంటనీరుగా కారకుండా
గుపెడంత గుండెలోన
దాచి వుంచ భద్ర పరిచ
దాగలేనని అది అలల కడలిల
ఉరకలేస్తూ పరుగుతీస్తూ
మది భంధనాలను తేన్చుకుంటూ
వాన చినుకుల...,కనుల నుండి కారుతుంది జలపతమలే
కంటి చూపు మసకబారింది
గుండె బరువుతో క్రుంగిపోయింది
కారి కారి కనీరు ఆవిరై
కనులు ఎండి ఎర్రబారినవి
పోదు గడవదు రేయ్ తలియదు
కలల స్వప్నం చదిరిపోయింది
కంట నీరుగా తరలిపోయింది
జ్ఞాపకాలను వీడిపోయింది
గాలి వానలో నను వదిలిపోయింది
................ఒంటరై తాను సాగిపోయింది.......!
ఒట్టులని గట్టుకి చెల్లు
కన్న కలలు కాటికి చెల్లు
జ్ఞాపకాలు మనసుకి మీగులు
నా కంటి పాప.....నీ మరణం పాపం ఎవరికి చెల్లు???
అదుముకున అపుకున అగనన్నవి కనీళ్ళు !!

నీ ప్రేమ కోసం

అమె........నేను..........

కామెంట్‌లు


అమె నింగిపై నక్షత్రం
నెను భువిపై ఆశ చిత్రం
ఆమె మేఘం ఒడిలో ఏడు రంగుల రూపం
నేను చేరాలని ఎగసిపడె అలల కెరటం
ఆమె ప్రతిభింభం నాహృదయంలో
తానేమో అందని దూరంలో
నా ఆశలనీ కనీరై కలగానే మేగిలాయి
ఆమె చూపులు చినుకులై ఎద లొతులు తకాయి
ఇది గాయపడిన మనసు కధ
జ్ఞాపకాల ప్రేమ వ్యధ (బాధ)
.............................................నా ప్రేమ పేరు మౌనం............................................
.............................................అది పెదవి దాటితే శాపం..................................

కనీరై ఎదను తాకే నీ జ్ఞాపకాలు మండే నా వేదన చలర్చగలవ...

కామెంట్‌లు


నా కనీటి బాష్పల చాటు
దాగున స్వప్నల పై ఒట్టు
నా హ్రుధయం దారులు అన్ని
నీ ప్రెమ పువులతొ పరిచ
ఎకంతంలొ వేచ
నీకై అనందలే మరిచ
కనీరే లేని లోకని స్రుహ్టించ
నీవు లేవన్న సంగతినె మరిచ
ఇ చికటి కల పేరే అశ
అది నెకైన తెలుస మనస
నా ఏదలొ పూసిన రొజ
నీకు హ్రుదయం అన్నది లేద
"అద్రుష్టం ఎరుగని నా జీవనపయనాన
ప్రేమ మెరిసిన మేరుపు
స్నేహం తొలకరి చినుకు
నా పయనం ఒంటరి వైపు ........

నేను పీల్చే శ్వాసవై

కామెంట్‌లు
నేను పీల్చే శ్వాసవై
నా హృది గదిని చేరు,
నేను విడిచే శ్వాసవై
నన్ను వీడి పోకు ,
ఓ "మధు"ర తలపువై
నా మదిని చేరు,
తిరిగి రాని కలవై
తీరాలు ధాటి పోకు,
దాహాన్ని తీర్చే
ద్రవమై చేరు,
కష్టంలో కరిగే
చెమటవై పోకు,
నువ్వు
నన్ను వీడిన నిమిషం
నేను
జలం వీడిన ఝషం.

నా కల ను సైతం నువ్వు చేరకున్నా

కామెంట్‌లు


నా కల ను సైతం నువ్వు చేరకున్నా
నిన్నటి నీ కలలోనే నిదురిస్తున్నా
నీ మాటల చిరుజల్లు కురిపించకున్నా
నీ తలపుల జడి లో నిత్యం తడుస్తున్నా
కన్నీరే నువ్వు నాకు మిగిల్చిన
నీ రూపం కరిగి పోకుండా వాటిని దిగమింగుతున్నా
నా తోడు నువ్వు రాకున్నా
నిన్నటి నీ అడుగుజాడల తోడు తో సాగుతున్నా
నీ గుండె లో నా రూపం చేర్పి వేసినా
అది నాకు చేత కాక నా గుండె నే ఆపివేస్తున్నా

నీవ్వు..............

కామెంట్‌లు
నా కన్నుల వెనుక స్వప్నం నీవ్వు
నా మాటల వెనుక మౌనం నీవ్వు
నా శ్వాసల వెనుక స్పందన నీవ్వు
నా విజయం వెనుక శ్రమ వి నీవ్వు
నా భాధల వెనుక కన్నీరు నీవ్వు
నా గమ్యం వెనుక పయనం నీవ్వు
నా రేపటి వెనుక నిన్నటివి నీవ్వు
ఇలా
నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడువి నీవ్వు

నీవే

కామెంట్‌లు


నా మదిలో ఆశల హరివిల్లు నిలిపిన చినుకు తడివి నీవే
నా కలల కోటను కూల్చిన కడలి కెరటం నీవే
నా మనసు నేర్చిన ప్రేమ ఓనమాలు నీవే
నా పెదవులు రచించిన మౌన కావ్యం నీవే
నా కంటి పాపకు జోల పాడిన జాబిలమ్మ వి నీవే
నా కంటి రెప్పల పై అల్లుకున్న కాళరాత్రి వి నీవే
నీ ఉహల దారులలో నన్ను నడిపింది నీవే
నీ యడబాటు తో నన్ను శూన్యం లో నిలిపింది నీవే
ఒంటరిగా సాగుతున్న నా జీవితాన్ని ఆక్రమించింది నీవే
నిన్ను నా అణుఅణువునా నింపుకున్న నన్ను ఒంటరిని చేసింది నీవే
నిన్ను పొందటాన్నికి నేను మరణించిన అది వరమే
మరు జన్మకైనా నా ప్రేయసివి నీవే

అందమైన ఇంత పెద్ద ప్రపంచాన్ని ......

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009 కామెంట్‌లు
అందమైన ఇంత పెద్ద ప్రపంచాన్ని చూడటానికి ..చిన్న చిన్నవి ఈ రెండు కళ్ళు చాలు ...
లోకాలేన్ని ఉన్న అన్నీ ఊహించేందుకు..చిన్న మెదడు చాలు ...
గమ్యం చేరడానికి ఇంత దూరమైన నడవాలని ఉండాలే గాని ..ఈ కాళ్ళు చాలు ...
బాద అయినా,సంతోషం అయినా భరించేందుకు..గుప్పెడు గుండె చాలు ...
అలాగే .......
నా జీవితం సంతోషంగా ఉండాలంటే...నీ చల్లని తోడు చాలు ...

నిదురించిన రెప్పలపే చేసావ్ ప్రేమ సంతకాలు...

కామెంట్‌లు
నిదురించిన రెప్పలపే చేసావ్ ప్రేమ సంతకాలు...


మూసి ఉన్న కనులకు చూపావు ఎన్నో అద్భుత దృశ్యాలు..

నిన్ను తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని ఉద్వేగం ...

రెక్కలు కట్టుకు వచ్చి నిన్నే చూడాలని ఆరాటం ...

కలలో అయిన వీడను నీ దివ్య రూపం ...

నీవు ఉంటె చాలు నాకు కనిపించదు లోకం ...

నీలి కన్నుల నింపావు ప్రేమ కడలి ...

కనిపించని మనసులోకి చొరబడి కదిలించావు ఈ హృదయాన్ని ...

నీ చిరునవ్వే నా గుండెల సవ్వడి ..

నువ్వే నా ప్రాణం .....
కామెంట్‌లు
కామెంట్‌లు
నా కల ను సైతం నువ్వు చేరకున్నా

నా కల ను సైతం నువ్వు చేరకున్నా
నిన్నటి నీ కలలోనే నిదురిస్తున్నా
నీ మాటల చిరుజల్లు కురిపించకున్నా
నీ తలపుల జడి లో నిత్యం తడుస్తున్నా
కన్నీరే నువ్వు నాకు మిగిల్చిన
నీ రూపం కరిగి పోకుండా వాటిని దిగమింగుతున్నా
నా తోడు నువ్వు రాకున్నా
నిన్నటి నీ అడుగుజాడల తోడు తో సాగుతున్నా
నీ గుండె లో నా రూపం చేర్పి వేసినా
అది నాకు చేత కాక నా గుండె నే ఆపివేస్తున్నా