ఈ జన్మకు తోడువు కావా ..............

శుక్రవారం, జులై 16, 2010 కామెంట్‌లు

నా ఆశలు నీలాకాశం
నాచూపులు తారల కోసం
ఆ తారల వెలుగువు నీవు, నా మదిలో ఉదయంతేవా
నా భవితకు మార్గం నీవు, ఈ జన్మకు తోడువు కావా
గడచిన కాలం ఎంతో తెలియదు
నేను నడచిన దూరం నీ వరకు
మిగిలిన జీవితం ఏమౌనో తెలియదు
నా దేహపు చలనం నీకొరకు
నేను గుర్తును అవుతా నీ గతమున కొలువై
నేను సాక్ష్యం అవుతా నీ రేపటి కలనై
నా ఎద వాకిలి నీకై తెరిచుంచాను
నువ్వు వరమయి వచ్చి నాకై మోక్షం కావా.........

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి