నా మనసు నీకు తెలిపేదేలా .......

శుక్రవారం, జులై 16, 2010 కామెంట్‌లు

నింగిలో తారలా వెలగనా, నేలపై చినుకులా రాలనా
నే మేఘమై వర్షించి నిను మైమరిపించనా
చిగురించే కొమ్మనై అలరించనా
నిను మురిపించ మయూరమై నర్తించన
నువు ఆలకించ కోకిలనై ఆలపించన
నిను మరిపించ సుమమై వికసించి తావినై చేరనా
నువు పవలించ పచ్చని పైరుతో పాన్పుగా మారనా
నిను సేదతీర్చ చిరుగాలినై సేవించనా
నువు పరవశించ సెలయేటి సయ్యటానై సాగనా

కలతన్నదే లేని కలిమిని
చెరగని చిరునవ్వుకి చెలిమిని
నీ ఏకాంతం లో మౌనమునై
నీ జీవన పయనములో నీడనై నీ వెంట సాగనా

నీకై తపించు నా ప్రేమ నిను చేరేదెలా
నా మనసు నీకు తెలిపేదేలా .......
నిను చేరు క్షణం కోసం వేచివున్న నేస్తమా...... నా ప్రాణమా....

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి