హృదయపు తలుపులు తెరిచి ప్రేమ ముంగిట
నీ రాకకై ఎదురు చూసినా నాటి నుండి నేస్తం
నా కనుల మాటున దాగిన సుమధుర స్వప్నం
ముగ్ధమనోహర నీ రూపమేనని తెలియలేదా
నీ గుండె గది లో ఈక నాకు చోటు లేదని తెలిసినా
నా గ్నాపకాల గూటి లో నిన్ను పదిలంగా ఉంచానంటే
నీ పై నా ప్రేమ అపరామయినదని తెలియలేదా
నీవు తెలుసన్నా,తెలియదన్నజరిగింది ఘోరం
నీ ఎడబాటు నా జీవితానికే ఒక పెద్ద శాపం
నీవు దూరమయ్యవనే నిజం నన్ను బాదిస్తున్న
నీవు నాతోనే ఉన్నావనే అందమయినా అబద్డంతోనే
జీవించే ఉన్నా జీవచవంలా........
మరిచిపోదామని మనసునడుగుదామంటే
మరపురాని గతం చేదు నిజమై నన్ను పరిహసిస్తోంది
"మీరు" , "నీవు" గా మారినా నిన్ను నన్ను .."మనం " గా
మార్చలేని నా హృదయం ఒక రోజు మూగబోతే
నా యెద సవ్వడి వినటం మరువకు చెలి
ఎందుకంటే అది మిగిల్చిన చివరి చప్పుడు
నీ పేరే పలుకుతుంది .......
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి