ఆశలు మూగవొయినాక కానీ తెలియలేదు..

ఆదివారం, ఆగస్టు 23, 2009 కామెంట్‌లు
ఆశలు మూగవొయినాక కానీ తెలియలేదు..
నా గుండె పిలుపు నీవు వినలేదని.
అలలు తీరాన్ని తడిపినాక కానీ తెలియలెదు..
నీ అడుగులకై అన్వేషించానని.
మసక చీకట్లొ..కంటి చివర...
ఓ కన్నీటి బొట్టు జారినాక కానీ తెలియలేదు ఒంటరితనం నన్నావహించిందని.
నీ దారిన పెనవేసుకున్న నా చూపు..నిరాశతొ వెనుతిరిగే వరకు తెలియలేదు..
నాకోసం నువ్వు రావని.
నిను వలచిన నా హ్రుదయం పగిలినాక కానీ తెలియలేదు...
ప్రణయమంటే వేదన అని.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి