నీ హృదయ ప్రమిద లో నా స్నేహ దీపం వెలిగించా ఆరనివ్వకు నేస్తమా..
నీ జీవన వని లో నా సానిత్యం వికసించింది వాడనివ్వకు మిత్రమా....
నీ కళ్ళ లోతుల్లో నా ప్రతిబింబం దాగుంది పదిలపర్చుకో నేస్తమా....
నీ హృదయ నది లో నా జ్ఞాపకాల అలలు దాగున్నాయి ఎగసిపడనివ్వు మిత్రమా....
నీ కలల కౌముదిలో నా ఊసుల జాడలున్నాయి చెరగనివ్వకు నేస్తమా...
నీ వెతల వేడిమిని నా స్నేహపు జల్లులు చల్లారుస్తాయి వేచి చూడు మిత్రమా....
ఇట్లు
-------------------
నీకై నీ కన్నా ఎక్కువగా పరితపించే నీ నేస్తం.....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి