నీకై చూసే ఎదురు చూపులో ప్రతి క్షణం నాకు ఒక కొత్త అనుభూతే .....
ఆ అనుభూతుల మజిలీ లో నిన్ను కలిసే క్షణం కోసం వేచి వుంటా ఏకాకి నై కడలి అంచున కడ దాక....
నీతో గడిపే ప్రతి క్షణం నా జీవితంలో ఓ మధుర జ్ఞాపకం ...
ఆ జ్ఞాపకాల వేకువలో అనుక్షణం నా జీవితం లో ఉషోధయమే...
నాలో జనించె ప్రతి గుండె చప్పుడు నిన్ను నాకు గుర్తు చేస్తుంది...
ఆ చప్పుడు ఆగినా ...అవి చేసే ప్రతిధ్వనులు నా ఆత్మలో ఇంకా శాశ్వుతమే....
మరు జన్మలో కుడా నీ సాన్నిత్యం కోసం నా ఆత్మ చేసే తపస్సులో గతించాయి కోటి వేకువలు...
కోటి నిశిధులు......
నీకై చూసే ఎదురు చూపులో ......
శుక్రవారం, ఆగస్టు 28, 2009
కామెంట్‌లు
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
11:34 PM
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి