గురువారం, ఆగస్టు 27, 2009 కామెంట్‌లు
అనుమతిస్తావా? నీ సిగలోకి


నే సంపంగి లా చేరగా

తాకనిస్తావా ? నీ పాదాలన్ని

నే పారాణిగా మారగా

చేరనిస్తావా? నీ హృదయ లోగిలికి

నే ప్రేమ కిరణంగా తాకగా

కరుణిస్తావా? నా పేద హృదయాన్ని

నీ ప్రేమకై ఆర్ధించగా

చూపిస్తావా? నా కన్నులకు ఈ లోకాన్ని

నీ జతలో సరిక్రొత్త గా

లాలిస్తావా? నా మనసు ను

పసిపాప లా నీ ఒడికి చేరగా

ఏలనిస్తావా నీ నూరేళ్ళ జీవితాన్ని

నీ మనసు గెలుచుకున్న విజేత గా

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి