గురువారం, ఆగస్టు 27, 2009 కామెంట్‌లు: 1
నువ్విక దురమౌతున్నావని తెలిసి నా మనసు మూగబోయింది...ఎద నిండా ఎగసిపడే ని జ్ఞాపకాల అలలను ఆపలేకపోతోంది...




కాలంతో పాటు వచ్చిన ఈ కన్నీటిని ,నీ జ్ఞాపకాలను కాలమే చేరిపెస్తుందనుకున్నా..స్వచ్చమయిన నా ప్రేమ శాశ్వుతమని తెల్సుకోలేక పోతున్నా..

ఎదనిండా నిండి పోయిన ఈ వేదన ఇంకేన్నాల్లో ఆలోచిస్తున్నా...



నిన్ను మరిచి జీవించడానికి ప్రయత్నిస్తున్నా..

కానీ లోలోపల మనసు కార్చే కన్నీటిని ఆపలేకపోతున్న...



నన్నొదిలి వెళ్ళిపోతున్న నీకు వీడ్కోలు చెబుతున్నా..

అలాగే నీపై నాకున్న ప్రేమ శాశ్వుతమని కుడా చెబుతున్నా..



ఈ కుల మత విభేదాలను దాటి తమ ప్రేమను సాధించుకునేది కొందరే..అందులో మనం లేమే అని బాధపడుతున్నా...

ఎక్కడున్నా..ఎవరితో ఉన్నా నీ జీవితం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నా...



నీ జీవితంలో నేనేప్పుడయినా తారసపడితే , నీనుంచి నేనశించేది ఒక్కటే..అదీ నీ చిరునవ్వే.....

అప్పటికీ నీపై నా కున్న ప్రేమ శాశ్వుతమని చెప్పడానికి సాక్షి కుడా ఒక్కటే..అదీ ఆ క్షణంలో నా కళ్ళల్లో మెదిలే కన్నీరే....

కామెంట్‌లు: 1

బలగ తమ్మినాయుడు :

మామూలు బాధ కాదు సర్ మీది!! అది కవితే అయినా కూడా అదిరిపోయింది .... మాటల్లో చెప్పలేను ఎంత బాగుందో అని!! చిట్టచివరి వాక్యం అయితే( కన్నీరే) వచ్చేసింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి